సర్కార్ వార్నింగ్: పిల్లలకు ఉదయం 9 తర్వాతే స్కూల్స్

సర్కార్ వార్నింగ్: పిల్లలకు ఉదయం 9 తర్వాతే స్కూల్స్

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యా రంగంలో సంచలన ఆదేశాలు  జారీ చేసింది. ఎల్ కేజీ, యూకేజీ నుంచి నాలుగో తరగతి వరకు క్లాసుల టైమింగ్స్ మార్చింది. ఉదయం 9 గంటల తర్వాతే క్లాసులు ప్రాంభించాలని.. ఉదయం 9 గంటలలోపు స్కూల్స్ ఓపెన్ చేయొద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ మానేజ్మెంట్లు ఈ టైమింగ్స్ ఫాలో అవ్వాలని స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల ముందే స్కూల్స్ ఓపెన్ చేయటం వల్ల.. పిల్లలకు నిద్ర లేమి సమస్యలు వస్తున్నాయని.. నిద్ర సరిపోవటం లేదని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. 

ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు ఎక్కువగా నైట్ టైంలో ఇంటర్ నెట్, మొబైల్ ఫోన్  వాడకం, ఇతర కారణాల వల్ల ఆలస్యంగా పడుకుంటున్నారని, ఉదయాన్నే తర్వగా లేచి నిద్రలేమి సమస్యలతో భాదపడుతున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దీపక్ కేసర్కర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే స్కూల్ టైమింగ్స్ మారుస్తూ ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ, విమర్శిస్తూ భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి.