పోలీసుల నిర్బంధంలో మ‌హాత్మాగాంధీ మ‌న‌వ‌డు

పోలీసుల నిర్బంధంలో మ‌హాత్మాగాంధీ మ‌న‌వ‌డు

మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీని 2023 ఆగస్టు 09నముంబై పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.  క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ క్రాంతి మైదాన్‌కు వెళ్లిన  ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 " స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా నేను ఆగస్ట్ 9 క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటి నుండి బయలుదేరినప్పుడు శాంటా క్రజ్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించబడ్డాను. నా ముత్తాతలను కూడా బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేసినందుకు నేను గర్వపడుతున్నాను. ఇది చారిత్రాత్మక తేదీ"  అని ట్వీట్ చేశారు.  

క్విట్ ఇండియా డే ఆగష్టు 9, 1942లో జరిగింది.  స్వాతంత్ర్య పోరాటం చివరి దశలలో ఒకటిగా నిలిచింది.  ఈ రోజున మహాత్మా గాంధీ "డూ ఆర్ డై" అనే పిలుపుతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లారు.  బ్రిటిషు పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో  మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించారు.  

దీనిని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు. క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్వర్ణోత్సవానికి గుర్తుగా 1992 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 రూపాయి స్మారక నాణెం జారీ చేసింది.