గాంధీ విగ్రహం గొంతు కోసిన దుండగులు

గాంధీ విగ్రహం గొంతు కోసిన దుండగులు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. మెల్‌బోర్న్‌ రోవిల్‌ ప్రాంతంలోని ఆస్ట్రేలియా భారత సంతతి కమ్యూనిటీ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. అహింసా మార్గాన్ని అనుసరించి మొత్తం ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన మహాత్మా గాంధీ స్మారక చిహ్నాలు వరల్డ్ వైడ్‌గా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈమధ్యే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోనూ గాంధీ విగ్రహాన్ని అక్కడి ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఆస్ట్రేలియాకు కానుకగా ఇచ్చింది. అయితే విగ్రహాన్ని ఆవిష్కరించిన గంటల్లోనే దాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడానికి యత్నించారు. విగ్రహం గొంతు కోయడానికి యత్నించడంతో గాట్లు పడ్డాయి. ఈ ఘటనను మారిసన్‌ తీవ్రంగా ఖండించారు. ఇది సిగ్గుపడాల్సిన చర్య అని.. విగ్రహంపై ఈ స్థాయి అగౌరవాన్ని చూపడం బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇది తీవ్ర అవమానకరమని.. ఇటువంటి దాడులను సహించబోమని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

హార్దిక్ పాండ్యాకు షాక్.. రూ.5 కోట్ల విలువైన రెండు వాచ్‌లు సీజ్

ఎమ్మెల్సీ ఎన్నికలల్లో పోటీ చేద్దామా? వద్దా?

ఇది స్ట్రెస్​ తగ్గించే విటమిన్.. ఏం తినాలంటే?

Image