Mahavataar Parashuram: 'మహావతార్ నరసింహ' తర్వాత అశ్విన్ కుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. 'మహావతార్ పరశురామ' త్వరలోనే!

Mahavataar Parashuram: 'మహావతార్ నరసింహ' తర్వాత అశ్విన్ కుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. 'మహావతార్ పరశురామ' త్వరలోనే!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో యానిమేషన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకువచ్చిన మూవీ 'మహావతార్ నరసింహ' . దర్శకుడు అక్విన్ కుమార్ తన సృజనాత్మకత, అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రా న్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ఊహించని విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో ఈ చిత్రం సాలిడ్ రన్‌ను కొనసాగిస్తూ, ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.

'మహావతార్ నరసింహ' సాధించిన భారీ విజయం తరువాత, తదుపరి ప్రాజెక్టుపై ప్రేక్షకులు, అభిమానులలో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. వారి అంచనాలకు తగ్గట్టుగానే, మేకర్స్ తమ తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అదే 'మహావతార్ పరశురామ'. లేటెస్ట్ గా ఈ సినిమాపై ఒక కీలక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కాబోతుంది.  దీంతో 'మహావతార్ పరశురామ' ఆరంభానికి ఇంకా కొద్ది నెలలే మిగిలి ఉంది.

'మహావతార్ నరసింహ' చిత్రంతోనే భారతీయ ప్రేక్షకులకు గ్లోబల్ స్థాయి విజువల్ అనుభూతిని అందించిన అశ్విన్ కుమార్, ఇప్పుడు 'మహావతార్ పరశురామ'తో ఏ స్థాయిలో అద్భుతాలు సృష్టిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, సంగీతం, సాంకేతిక అంశాలలో మునుపటి కంటే మరింత ఉన్నత స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'మహావతార్ నరసింహ' సృష్టించిన ప్రభంజనం తర్వాత, 'మహావతార్ పరశురామ' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం కూడా భారతీయ సినిమా చరిత్రలో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకుంటుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నారు. మరికొన్ని నెలలు వేచిచూస్తేనే, ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు వెలువడనున్నాయి.