ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి కృషి

ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి కృషి

పాలమూరు, వెలుగు: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా అభివృద్ధి చేస్తామని  మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్ లో మహబూబ్ నగర్  అర్బన్  మండలానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు రూ.38 లక్షల సీఎంఆర్ఎఫ్  చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్రమశిక్షణతో గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. 

సమస్యలను అధిగమించి పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్  ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. అనంతరం డీసీసీ కార్యదర్శి టంకర కృష్ణయ్య యాదవ్  ఆధ్వర్యంలో హన్వాడ మండలానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.  ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.