కాంగ్రెస్ లో చేరిన మాజీ జడ్పీ చైర్మన్

కాంగ్రెస్ లో చేరిన మాజీ జడ్పీ చైర్మన్

గద్వాల, వెలుగు : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ జోగులాంబ గద్వాల జిల్లా కాకులారం విలేజ్ కి చెందిన బండారి భాస్కర్ గురువారం కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరగా  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.   ప్రస్తుతం ఆయన పంచాయతీరాజ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తునారు.   కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు తిరుపతయ్య, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ లోకి ఊట్కూర్ ఎంపీపీ , ఇద్దరు సర్పంచులు

ఊట్కూర్, వెలుగు : మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్​ తగిలింది. గురువారం రాత్రి మక్తల్ కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సీతమ్మ సమక్షంలో  ఎంపీపీ ఎల్కోటి లక్ష్మీనారాయణ రెడ్డి దంపతులతో పాటు, లక్ష్మీ కాంత్ రెడ్డి, నిడుడుర్తి  సర్పంచ్ యశోదమ్మ, మల్లేపల్లి సర్పంచ్ మాణికమ్మ, పులిమామిడి సర్పంచ్ చిన్న సూరయ్య గౌడ్ తోపాటు, ఐదు వందల మంది కార్యకర్తలతో కాంగ్రెస్ లో చేరారు.  కార్యక్రమంలో  బాలకృష్ణా రెడ్డి, గోపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రవి కుమార్ యాదవ్, నాగరాజుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్​కు సర్పంచ్ రాజీనామా

ఆమనగల్లు, వెలుగు : కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అధికార పార్టీకి చెందిన మాడుగుల మండలం నర్సంపల్లి సర్పంచ్ హనుమాన్ నాయక్ గురువారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.  కార్యక్రమంలో ఎంపీపీ పద్మా రెడ్డి, సర్పంచు వెంకటేశ్వర్లు గౌడ్, ఎంపీటీసీ కిషన్ రెడ్డి, హనుమానాయక్ తదితరులు పాల్గొన్నారు.