బర్త్ డే పార్టీలో డ్యాన్స్తో రచ్చ చేసిన ధోని

బర్త్ డే పార్టీలో డ్యాన్స్తో రచ్చ చేసిన ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ స్టెప్పులేసి రచ్చచేశాడు. ఓ పబ్లో యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యాలతో కలిసి డ్యాన్సు ఇరగదీశాడు. ప్రస్తుతం ధోని, పాండ్యా బ్రదర్స్, ఇషాన్ కిషన్ చేసిన ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

బర్త్ డే పార్టీ రచ్చ రచ్చ..

మహేంద్ర సింగ్ ధోని తన ఫ్రెండ్ బర్త్ డే కోసం దుబాయ్ వెళ్లాడు. స్థానికంగా ఓ పబ్లో బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీలో ధోని రచ్చ చేశాడు. ధోని స్టెప్పులేస్తే..పబ్లో విజిల్స్ మోత మోగింది. ఈ పార్టీకి పాండ్యా బ్రదర్స్, ఇషాన్ కిషన్ కూడా హాజరయ్యారు. ఈ ముగ్గురితో కలిసి మాజీ కెప్టెన్ మాస్ డ్యాన్స్ చేశాడు. సింగర్స్తో కలిసి గొంతు సవరించారు. 

ఫ్యాన్స్ ఖుషీ..

ర్యాపర్ బాద్ షా పాట పాడుతుంటే..హార్దిక్, కృనాల్, ఇషాన్ కిషన్లపై ధోని చేతులేసి స్టెప్పులేశాడు. వీరంతా డ్యాన్స్ చేస్తుంటే..ధోని భార్య సాక్షి వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ధోనీ డ్యాన్స్‌ను చూసి అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు.