SSMB29: ప్రామిస్‌ చేశారు.. మాట నిలబెట్టుకోండి.. జక్కన్నతో మహేష్, పీసీ, పృథ్వీ ట్వీట్లు వైరల్.. రాజమౌళి సర్‌ప్రైజ్‌లు అన్నీ రివీల్!

SSMB29: ప్రామిస్‌ చేశారు.. మాట నిలబెట్టుకోండి.. జక్కన్నతో మహేష్, పీసీ, పృథ్వీ ట్వీట్లు వైరల్.. రాజమౌళి సర్‌ప్రైజ్‌లు అన్నీ రివీల్!

మహేష్ బాబు-రాజమౌళి భారీ అడ్వెంచరస్‌‌ మూవీ SSMB 29(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఇప్పటికే SSMB29 ఇండియాలో రెండు షెడ్యూల్స్‌‌, కెన్యాలో ఓ షెడ్యూల్‌‌ను పూర్తి చేశారు. అయితే నవంబర్‌‌‌‌లో ఫస్ట్ లుక్‌‌ రిలీజ్ చేయబోతున్నట్టు రాజమౌళి ప్రకటించడంతో.. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూస్తుండగానే నవంబర్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ హార్ట్ అవ్వకముందే.. రాజమౌళి వినూత్న ప్రమోషన్స్కి సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా లేటెస్ట్గా రాజమౌళితో పాటుగా SSMB 29 హీరో మహేష్ బాబు, హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ పృథ్వీరాజ్ సినిమాకి సంబంధించిన ‘కన్వర్జేషన్’ (Conversation) బయటకొచ్చాయి. 

ఫ్యాన్స్ సహజ ప్రశ్నలను.. వారి తరుపున సూపర్ స్టార్ మహేష్ బాబు, పీసీ, పృథ్వీ.. డైరెక్టర్ జక్కన్నను సరదాగా ప్రశ్నించారు. ఇపుడు వీరి చాట్స్ బయటకి రావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి జక్కన్న టీమ్ ఏం మాట్లాడుకున్నారో ఓ లుక్కేద్దాం. 

మహేష్ బాబు: డైరెక్టర్ రాజమౌళి సర్‌.. నవంబరు వచ్చేసింది. అప్‌డేట్‌ ఎప్పుడిస్తారు?

రాజమౌళి: అవును. ఈ నవంబరు నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దామనుకుంటున్నావ్‌?

మహేష్: మీ డ్రీమ్‌ ప్రాజెక్టు మహాభారత మూవీ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా సర్‌. నవంబరులో అప్‌డేట్‌ ఇస్తానని ప్రామిస్‌ చేశారు. మాట నిలబెట్టుకోండి.

రాజమౌళి: ఇప్పుడే కదా మొదలైంది మహేష్. ఒక దాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఇద్దాం.

మహేష్: ఎంత నెమ్మదిగా సర్‌. 2030లో మొదలుపెడదామా? SSMB29 హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఇప్పటికే హైదరాబాద్‌ వీధుల్లో ఇన్‌స్టా రీల్స్‌ చేస్తోంది.

ప్రియాంక చోప్రా: హలో హీరో. సెట్స్‌లో నువ్వు నాతో పంచుకునే కథలన్నీ నేనే లీక్ చేయాలనుకుంటున్నావా? మైండ్‌లో ఫిక్స్‌ అయితే బ్లైండ్‌గా వేసేస్తా.

రాజమౌళి: మహేష్.. SSMB29లో ప్రియాంక చోప్రా ఉందనే విషయం ఎందుకు చెప్పావ్‌? నువ్వు సర్‌ప్రైజ్‌ను మిస్‌ చేశావ్‌.

మహేష్: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఉన్నారనే విషయాన్నీ దాచాలనుకున్నారా?

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌: రాజమౌళి సర్‌.. నేను సరదా వెకేషన్‌కు హైదరాబాద్‌ వస్తుంటే నా ఫ్యామిలీ నన్ను అనుమానిస్తోంది (నవ్వుతూ)

రాజమౌళి: మహేష్.. నువ్వు అన్ని సర్‌ప్రైజ్‌లూ బయటపెట్టేశావ్‌. అందుకే నీ ఫస్ట్‌లుక్‌ వాయిదా వేయాలనుకుంటున్నా.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌: మీరు మీ విలన్స్‌ని ఎంతగా ఇష్టపడతారో నాకు తెలుసు సర్‌.

ప్రియాంక: బెటర్‌ లక్‌ నెక్స్ట్‌ టైమ్‌ మహేష్.. 

మహేష్: ఓరి దీని వేషాలో.. ది బెస్ట్‌ని ఎప్పుడైన మన రాజమౌళి చివరిలోనే చూపిస్తారు.

ఇప్పుడు అర్ధమైంది కదా.. SSMB 29లో మహేష్ తో పాటుగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రియాంక చోప్రా నటిస్తున్నారని. ఇప్పటికే ఈ విషయం అందరికీ తెలిసిపోయినప్పటికీ, ఇపుడు వారి నోటి వెంటే రావడం ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో వీరి సరదా చాటింగ్స్ సోషల్ మీడియాలో దున్నేస్తున్నాయి.

ఓవరాల్గా వీరి చాటింగ్ గమనించి చూస్తే.. ఫస్ట్  SSMB 29 విలన్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలా.. నవంబర్ 16 లోపు పృథ్వీరాజ్‌, ప్రియాంక తర్వాత మహేష్ లుక్ వస్తుందనే సంకేతాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుందో!

ఇకపోతే, జక్కన్న నవంబర్ 16న హాలీవుడ్ స్థాయిలో ఓ గ్రాండ్ ఈవెంట్‌‌ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటుగా మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2027 మార్చిలో ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నట్లు సమాచారం.

భారీ బడ్జెట్తో తెరకెక్కతున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయమని అభిమానులు, సినీ విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌పై కె.ఎల్. నారాయణ దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారని టాక్.