భారీగా విస్తరించనున్న డాలర్.. బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా మహేష్ బాబు

భారీగా విస్తరించనున్న డాలర్.. బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా మహేష్ బాబు

హైదరాబాద్, వెలుగు:  ఇన్నర్ వేర్ కంపెనీ డాలర్​దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది విస్తరించడానికి రెడీ అయింది.  కొత్తగా 50కిపైగా స్టోర్లను తెరుస్తామని, హైదరాబాద్​లో రిటైల్​ స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని తెలిపింది. విస్తరణ అవసరాల కోసం రూ.55 కోట్లు పెట్టుబడిగా పెడతామని ప్రకటించింది. బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా మహేష్ బాబును నియమించింది. మనదేశంలో డాలర్​కు 15 శాతం మార్కెట్ వాటా ఉంది. ఈ ఏడాది గ్రూప్ 11 నుంచి 12 శాతం వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది.  ప్రస్తుత సంవత్సరం నుంచి దక్షిణాది మార్కెట్ నుంచి దాదాపు 50 శాతం అమ్మకాల వృద్ధిని లక్ష్యంగా చేసుకున్నామని మేనేజింగ్ వినోద్ కుమార్ గుప్తా చెప్పారు. దక్షిణాది మార్కెట్ నుంచి తమ దేశీయ ఆదాయంలో 20 శాతం సంపాదించాలన్నది లక్ష్యమన్నారు.