Mahesh Babu: భారత త్రివర్ణ పతాకం ఎప్పుడూ లేనంత ఎత్తులో ఎగురుతుంది.. మహిళల జట్టుపై మహేష్ బాబు ప్రశంసలు

Mahesh Babu: భారత త్రివర్ణ పతాకం ఎప్పుడూ లేనంత ఎత్తులో ఎగురుతుంది.. మహిళల జట్టుపై మహేష్ బాబు ప్రశంసలు

భారత మహిళల జట్టు వరల్డ్ కప్ కళను సాకారం చేసుకుంది. ఎన్నో ఏండ్ల కలను సాకారం చేసుకున్న ఇండియా అమ్మాయిల జట్టు ఎట్టకేలకు జగజ్జేతగా అవతరించింది. ఐదు దశాబ్దాలుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్ ను భారత మహిళలు జట్టు సొంతం చేసుకుంది. సొంతగడ్డపై తిరుగులేని ఆట ఆడుతూ విశ్వ విజేతగా అవతరించింది.

ఆదివారం (2025 నవంబర్ 2) జరిగిన ఫైనల్లో హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా 52 రన్స్ తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. 52 ఏళ్ళ వరల్డ్ కప్ చరిత్రలో భారత మహిళల జట్టుకు తొలి వన్డే వరల్డ్ కప్ కావడం విశేషం. ఈ విజయంతో సర్వత్రా భారత మహిళల జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా క్రికెట్ను అమితంగా ఇష్టపడే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మన అమ్మాయిలు విజేతగా నిలిచినందుకు జట్టును ప్రశంసించాడు. టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

‘‘ఎంతటి అద్భుతమైన క్షణం. త్రివర్ణ పతాకం ఎప్పుడూ లేనంత ఎత్తులో ఎగురుతుంది. భారత మహిళల జట్టు చరిత్ర గర్వించదగ్గ అధ్యాయాన్ని జోడించింది. ఈ టోర్నమెంట్ అంతటా భారత మహిళల జట్టు అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించింది. ఈ ఛాంపియన్స్ సాధించిన క్షణాలు.. భారతదేశం ఉనికిని, సత్తాను ఉన్నతశిఖరాలకు చేర్చింది’’ అని మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మహేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

SSMB 29: మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచరస్‌‌ మూవీ SSMB 29 (వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్కు కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఇప్పటికే SSMB29 ఇండియాలో రెండు షెడ్యూల్స్‌‌, కెన్యాలో ఓ షెడ్యూల్‌‌ను పూర్తి చేశారు. అయితే నవంబర్‌‌‌‌లో ఫస్ట్ లుక్‌‌ రిలీజ్ చేయబోతున్నట్టు రాజమౌళి ప్రకటించడంతో.. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 INDvSA మ్యాచ్ విషయానికి వస్తే: మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ వీరోచిత సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది.

షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్ రౌండ్ షోతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్లో సమిష్టిగా రాణించి వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుంది. షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.