
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు ఇటీవల ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన షబ్బీర్ అలీ, వేణుగోపాల్ రావు, వేం నరేందర్‌రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన మల్లు రవి కూడా రేవంత్‌ను కలిశారు.
జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో ఈ భేటీ జరిగింది. దావోస్ పర్యటనలో తెలంగాణకు రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడంపై సీఎం రేవంత్ రెడ్డికి వారంతా అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీలుగాఎన్నికైన వెంకట్, మహేశ్ గౌడ్‌ను రేవంత్ అభినందించారు.