Hardik Pandya: హార్దిక్ కుటుంబంలో చిచ్చు పెట్టిన మహికా శర్మ.. విడిపోతున్న పాండ్యా బ్రదర్స్..?

Hardik Pandya: హార్దిక్ కుటుంబంలో చిచ్చు పెట్టిన మహికా శర్మ.. విడిపోతున్న పాండ్యా బ్రదర్స్..?

Hardik Pandya: భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కుటుంబంలో అతడి గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ చిచ్చు పెట్టింది. ఇద్దర అన్నదమ్ముల ( హార్దిక్– కృనాల్ పాండ్యా) మధ్య  విభేదాలు వచ్చాయా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత అభిమానులు గమనించిన కొన్ని విషయాలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నాయి. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి.. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. ఈ విజయానికి సంబంధించిన పోస్టులు లేదా అభినందనలు అతని అన్న క్రునాల్, వదిన పంకురి శర్మ నుంచి నెట్టింట ఎక్కడ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాదు, ఫైనల్ మ్యాచ్ లో కృనాల్ పాండ్యా, ఆయన భార్య స్టేడియంలో కనిపించకపోవడం ఈ చర్చకు మరింతగా వైరల్ అవుతుంది. దీంతో ఇద్దరు సోదరుల మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం.. హార్దిక్ పాండ్యా– మోడల్ మహికా శర్మ మధ్య ఉన్న సన్నిహిత సంబంధం వల్లే ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని పేర్కొంటున్నారు. 25 ఏళ్ల మహికా శర్మ టీ20 వరల్డ్ కప్ మొత్తం హార్దిక్‌తో కలిసి ప్రయాణిస్తుస్తూ స్టేడియంలో అతనికి సపోర్టు చేసింది. 

ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సమయంలో హార్దిక్ కుమారుడు అగస్త్య పాండ్య కూడా మహికాతో కలిసి మ్యాచ్‌ను వీక్షించాడు. హార్దిక్ 12 బంతుల్లో 27 పరుగులు చేసి అవుట్ కావడంతో అగస్త్య కొంత నిరాశకు గురైనట్లు కనిపించగా, మహికా అతన్ని ఓదార్చిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఫైనల్ లో గెలిచిన అనంతరం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో హార్దిక్– మహికా రొమాన్స్ చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.  

►ALSO READ | Arshdeep Singh: వరల్డ్ కప్ ఫైనల్లో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్కి షాక్ ఇచ్చిన ఐసీసీ
 
సోషల్ మీడియాలో ఈ విషయంపై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది కేవలం ఊహాగానం మాత్రమే అంటున్నారు. నెట్టింట పోస్టులు పెట్టకపోతే కుంటుంబంలో విభేదాలు ఉన్నాయని అనుకోవడం సరైంది కాదు.. ఫ్యామిలిలో చిన్న చిన్న మనస్పర్దలు వస్తుంటాయని ఒక యూజర్ రాసుకొచ్చాడు. మరో వ్యక్తి ఇలా కామెంట్ పెట్టాడు.. హార్దిక్ గత ఏడాది నుంచి వేరుగా ఉంటున్నాడు.. మహికాతో జరిగిన ఎంగేజ్‌మెంట్‌కు కూడా కృనాల్‌ను ఆహ్వానించలేదని తెలుస్తుందని పేర్కొన్నాడు. అయితే ఒక ప్రేమ ఇద్దరి అన్నదమ్ముల మధ్య బంధాన్ని విడదీసిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే, ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా గానీ కృనాల్ పాండ్యా కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దాంతో ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంతా అభిమానుల ఊహాగానాలకే పరిమితమైంది.