అసలు పుష్ప ఎక్కడా?.. బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది

అసలు పుష్ప ఎక్కడా?.. బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది

సుకుమార్ దుర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేసిందే తెలిసిందే. అప్పటి వరకు సౌత్ స్టార్ గా ఉన్న బన్నీని రాత్రికి రాత్రి ప్యాన్ ఇండియా స్టార్ గా చేసింది. ఇక ఉత్తరాదిలో ఈ సినిమాకి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. డీఎస్పీ పాటలు రీల్స్, షాట్స్ రూపంలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. స్టార్ సెలబ్రెటీలను సైతం స్టెప్పులేసేలా చేశాయి ఈ సినిమా పాటలు. ఇప్పుడు పుష్ప 2 పేరుతో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ అనౌన్స్మెంట్ చేసి రోజులు గడుస్తున్నా ఒక్క అప్డేట్ కూడా రాకపోవడం బన్నీ అభిమానులను నిరాశకు గురిచేసింది. దీంతో మైత్రి మూవీ మేకర్స్ ఎట్టకేలకు దీనిపై స్పందించింది.

మొదట రష్మిక పుట్టిన రోజు సందర్భంగా తన పోస్టర్ లుక్ ను విడుదల చేసింది. అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చిందంటూ చల్లటి కబురు వినిపించింది. చెప్పినట్టుగానే బుధవారం 11 గంటలకు సినిమాకు సంబంధించిన చిన్న గ్లింప్స్ ను విడుదల చేసింది. ‘తిరుపతి జైలు నుంచి బుల్లెట్టు గాయాలతో తప్పించుకున్న పుష్ప’ అంటూ ఈ గ్లింప్స్ మొదలవుతుంది. పుష్ప కోసం జనాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం వంటివి ఇందులో కనిపిస్తున్నాయి. ‘అసలు పుష్ప ఎక్కడా?’ అనే క్వశ్చన్ మార్క్ తో ఈ వీడియోను పూర్తి చేశారు. దీనికి ‘హంట్ బిఫోర్ ద రూల్’ అంటూ మైత్రి మూవీ మేకర్స్ క్యాప్షన్ ను యాడ్ చేసింది. అయితే ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు కావడంతో కనీసం ఈ అప్ డేట్ లో కొత్త లుక్ ను వదులుతారని ఆశించిన ఫ్యాన్స్ కు మాత్రం ఇది కొంత నిరాశ కలిగిస్తోంది. 

 

https://twitter.com/PushpaMovie/status/1643487881774743554

https://twitter.com/MythriOfficial/status/1643475355351797761