ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్​తో బట్టలు నేసి..

ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్​తో బట్టలు నేసి..

చాలాచోట్ల ప్లాస్టిక్‌‌‌‌ నిషేధం. కానీ, ఇక్కడి వాళ్లు డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటారు. అంతేకాదు ఆ ప్లాస్టిక్ వస్తువులను తయారుచేసిన ఆమెకు అవార్డు ఇచ్చారు. అదేంటది అని ఆశ్చర్యపోతున్నారా! అయితే ఇది చదవాల్సిందే. ఫ్యాబ్రిక్‌‌‌‌, బ్యాగ్స్‌‌‌‌, చెప్పులు, హోమ్‌‌‌‌ అప్లయెన్స్‌‌‌‌లను ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్‌‌‌‌తోనే తయారుచేస్తోంది.  వీటికోసం తొంబైశాతం ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్‌‌‌‌, పదిశాతం టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ను వాడుతోంది నైజీరియాకు చెందిన డిజైనర్‌‌‌‌‌‌‌‌ అడెజోక్‌‌‌‌ లసిసి. 

నైజీరియాలో వాటర్‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్‌‌‌‌లను తయారుచేయడానికి మామూలుగా నైలాన్‌‌‌‌ను వాడతారట. అవి కొత్తవి తయారుచేయడానికి అయ్యే ఖర్చు కంటే రీసైకిల్‌‌‌‌ చేయడానికే ఖర్చు ఎక్కువ అవుతుందట. అందుకే ఆ వాటర్‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్‌‌‌‌లను రీసైకిల్‌‌‌‌ చేయకుండా పడేస్తున్నాయి అక్కడి కంపెనీలు. చిన్నప్పటినుండి చుట్టూ పేరుకుపోతున్న  ప్లాస్టిక్‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్‌‌‌‌ల గుట్టలను చూస్తూ పెరిగింది లసిసి. అప్పటినుండే వాటి వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకుంది. 

అందుకే ప్లానెట్‌‌‌‌ 3ఆర్‌‌‌‌‌‌‌‌
లసిసి వాళ్ల అమ్మ మొదటి నుండే సాంచ మీద బట్టలు నేసేది. ఫ్యాషన్‌‌‌‌ డిజైనింగ్‌‌‌‌ పూర్తి చేసిన లసిసికి సాంచను చూడగానే ఒక కొత్త ఆలోచన వచ్చింది. ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ను రీసైకిల్‌‌‌‌ చేసి వాటినుండి క్లాత్‌‌‌‌ తయారుచేయాలని అనుకుంది. వాళ్ల అమ్మ సహాయంతో సాంచను ఎలా వాడాలో నేర్చుకుంది. తరువాత ఆ వాటర్‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్స్‌‌‌‌ను బాగా ఎండ బెట్టి, వాటిని కత్తెరతో చిన్నగా కత్తిరించింది. వాటికి టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ నుండి వచ్చే వేస్ట్‌‌‌‌ను కలిపి సాంచ మీద బట్టను నేయడం స్టార్ట్‌‌‌‌ చేసింది. ఈ బట్టనే వాళ్లు ‘అసో–ఒకే’ అని పిలుస్తున్నారు. 

తనకు వచ్చిన ఆలోచననుండి పుట్టిందే ‘ప్లానెట్‌‌‌‌ 3ఆర్‌‌‌‌‌‌‌‌’ కంపెనీ. 3ఆర్‌‌‌‌‌‌‌‌ అంటే (రెడ్యూజ్‌‌‌‌, రీయూజ్, రీసైకిల్‌‌‌‌). ఈ కంపెనీలో వాటర్‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్స్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ నుండి ఫ్యాబ్రిక్‌‌‌‌, చెప్పులు, బ్యాగ్స్‌‌‌‌, హోమ్‌‌‌‌ అప్లయన్సెస్‌‌‌‌లను తయారుచేస్తున్నారు. నైజీరియాలో రోజుకు దాదాపు అరవై మిలియన్‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్స్‌‌‌‌ అమ్ముడవుతున్నాయి. వాటిలో ఎక్కువ ఆరు లీటర్ల వాటర్‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్సే ఉంటాయి. ఇవి పెద్దగా ఉంటాయి. కాబట్టి ఈజీగా క్లాత్‌‌‌‌ తయారు చేయొచ్చు. ఏడాదికి లక్షా ముప్పైవేల టన్నుల ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ వాటర్‌‌‌‌ ప్యాకెట్స్‌‌‌‌ నుండి వస్తోంది. వీటిని కలెక్ట్‌‌‌‌ చేయడం కోసం సిటీలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో డస్ట్‌‌‌‌బిన్స్‌‌‌‌ కూడా పెట్టింది. ఈ ఎన్విరాన్‌‌‌‌మెంటలిస్ట్‌‌‌‌ తన వంతు సాయంగా ప్లాస్టిక్‌‌‌‌ వాడకాన్ని తగ్గించడం కోసం అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌ ప్రోగ్రామ్స్‌‌‌‌ కూడా పెడుతోంది. ప్లానెట్‌‌‌‌ 3ఆర్‌‌‌‌‌‌‌‌లో పనిచేసేవాళ్లలో ముఖ్యంగా నిరుద్యోగులు, ఫిజికల్లీ చాలెంజ్డ్‌‌‌‌, మహిళలు ఉన్నారు. 

వీళ్లకు రీసైకిలింగ్‌‌‌‌ పైన ఫ్రీ ట్రెయినింగ్‌‌‌‌ ఇచ్చి పనిలో పెట్టుకుంటోంది. అడెజోక్‌‌‌‌ లసిసి ఎన్విరాన్‌‌‌‌ మెంటలిస్టే కాదు ఆర్టిస్ట్‌‌‌‌, డిజైనర్‌‌‌‌‌‌‌‌, బాస్కెట్‌‌‌‌ బాల్‌‌‌‌, చెస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ కూడా. ఎంతోమందికి ఇన్‌‌‌‌స్పిరేషన్‌‌‌‌ అయిన లసిసి, తను చేస్తున్న పనులకు ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. రీసెంట్‌‌‌‌గా ‘ఆఫ్రికా గ్రీన్‌‌‌‌ గ్రాంట్‌‌‌‌ అవార్డ్‌‌‌‌’ను కూడా గెలుచుకుంది.