ఈ ఎన్నికలు గత ఎలక్షన్స్‌‌లా కాదు

ఈ ఎన్నికలు గత ఎలక్షన్స్‌‌లా కాదు

ఫిలడెల్ఫియా: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌పై అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా మండిపడ్డారు. కరోనా మహమ్మారి పరిస్థితులను ఎదుర్కోవడంలో ట్రంప్ విఫలమయ్యారని, వైరస్ నుంచి ఆయన తనను తాను రక్షించుకోలేకపోయారని విమర్శించారు. డెమొక్రాట్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్‌‌కు మద్దతుగా సౌత్ ఫిలడెల్ఫియాలో నిర్వహించిన ర్యాలీలో ఒబామా పాల్గొన్నారు. ‘ఇంతకుముందెన్నడూ లేనంతగా మనం మారాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో ఏ సందేహాలనూ విడిచిపెట్టొద్దు. గతంలోనూ ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి. అవి పెద్దగా ఉపయోగపడలేదు. కానీ ఈసారి అలా కాకూడదు’ అని ఒబామా పేర్కొన్నారు.