ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని మాకోడా గ్రామానికి చెందిన నిమ్మల మల్లమ్మ అనే వృద్ధురాలి 100వ పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం జరిగిన వేడుకల్లో మల్లమ్మ కేక్ కట్ చేసి కొడుకులు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి స్టెప్పులు వేశారు. మల్లమ్మకు ఆరుగురు సంతానం కాగా ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఈ వేడుకల్లో వంద మందికిపైగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
