సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివి : జి.చెన్నయ్య

సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివి :  జి.చెన్నయ్య
  • మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య

జీడిమెట్ల, వెలుగు: సావిత్రి బాయి పూలే మహిళలు, బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి, విద్యనందించి వారి  జీవితాల్లో వెలుగులు నింపారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. ఆమె సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

 టీచర్స్​డే సందర్భంగా శుక్రవారం శ్రీనివాస్​నగర్​లోని బీఆర్.అంబేద్కర్​ విగ్రహం వద్ద అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు నివాళి అర్పించారు. సావిత్రిబాయి పూలే ఆశయసాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రాజేశ్, నాయకులు సతీశ్, రాధాబాయి, రాజు గబ్బర్, సందీప్​తదితరులున్నారు.