
మళయాళ దర్శకుడు సిద్ధిక్(63) సోమవారం గుండెపోటుతో కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషయమంగా ఉందని వైద్యులు తెలిపారు. గత కొంత కాలంగా ఆయన న్యుమోనియా మరియు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం.
మళయాళ చిత్ర పరిశ్రమలో గత ముప్పై ఏళ్లుగా తన సేవలు అందిస్తున్నారు దర్శకుడు సిద్ధిక్. రామోజీ రావు స్పీకింగ్ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు సిద్ధిక్. ఆతరువాత గాడ్‌ఫాదర్, కాబూలీవాలా, హిట్లర్, ఫ్రెండ్స్, వియత్నాం కాలనీ, బిగ్ బ్రదర్ మరియు లేడీస్ అండ్ జెంటిల్‌మన్ వంటి విజయమంతమైన చిత్రాలను అందించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ బాడీగార్డ్ చిత్రానికి దర్శకత్వం వహించారు సిద్ధిక్.
కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు నటుడిగా కూడా పలు సినిమాల్లో నటించారు సిద్దిక్. పూవిను పుతియ పూంతేన్నాల్, వర్షం 16 మరియు నొక్కేతధూరతు కన్నుమ్ నట్టు వంటి చిత్రాలలో కూడా నటించాడు. అంతేకాదు నిర్మాతగా మోహన్ లాల్ తో బిగ్ బ్రదర్ అనే సినిమాను ప్రేక్షకులకు అందించారు.