ఓటీటీలోకి మలయాళ సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి. ప్రతివారం కొత్త సినిమాలు తీసుకొస్తూ ఆడియన్స్లో క్రేజ్ పెంచుతూ వస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా మలయాళ వెర్షన్ నుంచి తెలుగులో డబ్ చేస్తూ టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచేసుకుంటున్నారు. అక్కడి మేకర్స్ రాసుకునే రియలిస్టిక్ కథలు, సహజమైన పాత్రలు, ఉక్కిరిబిక్కిరి చేసే స్క్రీన్ ప్లే కట్టిపడేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఓ క్రేజీ మలయాళ రొమాంటిక్ లవ్ స్టోరీ ఓటీటీకి వచ్చి అలరిస్తుంది. అదే ‘మధువిధు’. మధువీధు అంటే హనీమూన్ అని అర్థం. షరాఫుద్దీన్, కల్యాణి పణిక్కర్ జంటగా నటించిన ఈ మూవీని విష్ణు అరవింద్ డైరెక్ట్ చేశాడు. మహిళల్లేని ఇంటికి కోడలిగా వెళ్లిన స్నేహ అనే యువతి పరిస్థితేంటన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కించారు దర్శకుడు.
థియేటర్లో మిక్సెడ్ టాక్ అందుకున్న ఈ మూవీ మే 22 నుంచి సోనీలివ్ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ‘నారదన్’, ‘మాస్టర్‌పీస్’ లాంటి సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో కీలక పాత్రలు పోషించిన షరఫ్ హీరోగా నటించడంతో తెలుగు ఆడియన్స్ ఓ లుక్కేస్తున్నారు.
Your perfect family-friendly Madhuvidhu for the weekend is streaming now! 🤗❤️
— Sony LIV (@SonyLIV) May 22, 2026
#Madhuvidhu streaming from May 22 only on Sony LIV
#SonyLIV #SonyLIVMalayalam
#Sharafudheen #KalyaniPanicker #VishnuAravind #BibinMohan #Jagadish pic.twitter.com/4Ra3c6sw2M
కథేంటంటే:
అమృత్‌రాజ్ అలియాస్ అమ్మూ (షరాఫుద్దీన్)ది సంప్రదాయ కుటుంబం. ఇంట్లో అందరూ మగవాళ్లే ఉంటారు. అందరూ కలిసి అమ్మూకి పెండ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. 28 పెళ్లి సంబంధాలు వచ్చినా ఒక్కటి కూడా కుదరదు. ఈ క్రమంలోనే అతనికి పరిచయమైన స్నేహ (కల్యాణి పణిక్కర్)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెండ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటారు. కానీ.. వాళ్లవి వేర్వేరు మతాలు కావడంతో కొన్ని ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి. ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు వస్తాయి. అవన్నీ వాళ్ల బంధంపై ప్రభావం చూపిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరూ ఒక్కటయ్యారా? లేదా? సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే:
సినిమా ప్రధాన బలం దాని సహజమైన కథనం. అతిగా డ్రామా లేకుండా, నిజ జీవితానికి దగ్గరగా సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కుటుంబ విలువలు, మత భేదాలు, ప్రేమలో ఎదురయ్యే ఒత్తిళ్లు వంటి అంశాలను దర్శకుడు సున్నితంగా చూపించే ప్రయత్నం చేశారు. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా ఆకట్టుకుంటాయి.
►ALSO READ | ప్రభుత్వానికి సొంత ఓటీటీ ఉండాలి: టికెట్ల రేట్లు కూడా పెంచాలంటూ CM విజయ్కు సేతుపతి రిక్వెస్ట్
షరాఫుద్దీన్ తన పాత్రలో సహజంగా కనిపిస్తాడు. కల్యాణి పణిక్కర్ కూడా తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కథకు బలం చేకూర్చింది. అయితే సినిమా స్లో నేరేషన్ తో వెళుతున్న ఫీలింగ్ కొన్ని చోట్ల కలుగుతుంది. కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఆశించే వారికి ఇది కాస్త సాదాసీదాగా అనిపించవచ్చు. ఫైనల్‌గా: యాక్షన్ లేదా భారీ ట్విస్టుల కంటే సహజమైన ప్రేమ కథలు, కుటుంబ భావోద్వేగాలు ఇష్టపడేవారికి ‘మధువిధు’ ఒక మంచి వాచ్.
