Abraham Ozler OTT: మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

Abraham Ozler OTT: మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

ఈ ఏడాది జనవరి 11న  రిలీజైన మలయాళీ థ్రిల్లర్ అబ్ర‌హం ఓజ్ల‌ర్ (Abraham Ozler) మూవీ ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ కొన్నిసార్లు వాయిదా పడిన డిజిటల్ ప్రీమియర్ మొత్తానికి..మార్చి 20న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) లో స్ట్రీమింగ్ కానుంది.కేవలం మలయాళంలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా స్ట్రీమింగ్‌ చేసే అవకాశం ఉంటుందని సమాచారం.మెడిక‌ల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ కథాంశంతో తెర‌కెక్కిన అబ్ర‌హం ఓజ్ల‌ర్ లో సీనియర్ యాక్టర్ జ‌య‌రాం(Jayaram) హీరోగా న‌టించాడు.

Also Read :బాలకృష్ణ 109లో మరో విజ్జీ పాప..తెలుగమ్మాయి అందం వెరీ స్పెషల్

ఈ సినిమాలో మ‌మ్ముట్టి సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కనిపించాడు. దాదాపు రూ.5కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్..బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వ‌ర‌కు కలెక్షన్స్ రాబ‌ట్టింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ థియేటర్ ఆడియాన్స్ కు బాగా నచ్చేసింది. మరి ఓటీటీలో ఆడియన్స్ కు..క్రైమ్ జోనర్ను ఇష్టపడే వారికి ఎలాంటి థ్రిల్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమాలో అబ్ర‌హం ఓజ్ల‌ర్ అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా హీరో జ‌య‌రాం నటనకు ప్ర‌శంస‌లు అందుకున్నారు.   

అబ్రహం ఓజ్లర్ కథేంటి?

అబ్ర‌హం ఓజ్ల‌ర్ (జ‌య‌రాం) భార్యాపిల్ల‌లు అనుకోకుండా మిస్స‌వుతారు. వారు క‌నిపించ‌కుండా పోయినా..తన పక్కనే ఉన్న‌ట్లుగా ఓజ్ల‌ర్ ఊహించుకుంటుంటాడు. వ‌రుస‌గా కొంద‌రు భిన్న నేప‌థ్యాలు క‌లిగిన వ్య‌క్తులు హ‌త్య‌ల‌కు గురువుతుండడం..వారి వ‌ద్ద హ్యాపీ బ‌ర్త్ డే అంటూ ర‌క్తంతో రాసి ఉన్న పేప‌ర్స్ దొరుకడం..ఆ హ‌త్య‌ల వెన‌కున్న ట్విస్ట్‌ను ఓజ్ల‌ర్ అనే పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు? అలెక్స్ (మ‌మ్ముట్టి) సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా మార‌డానికి వెనుకున్న కార‌ణం ఏమిటి? సుజా అనే అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు తెలియాలంటే అబ్రహం ఓజ్లర్ సినిమా చూడాల్సిందే. ఈ మూవీకి మిదున్ థామ‌స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.