మోదీ అండ్ కంపెనీకి త్వరలోనే ఎగ్జిట్ డోర్: ఖర్గే

మోదీ అండ్ కంపెనీకి త్వరలోనే ఎగ్జిట్ డోర్: ఖర్గే

న్యూఢిల్లీ: మోసం ఒక్కటే బీజేపీ విధానమని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీ అండ్ కంపెనీకి జమ్మూకాశ్మీర్ యువత ఎగ్జిట్ డోర్ చూపిస్తారని ట్వీట్ చేశారు. ‘‘జమ్మూకాశ్మీర్ యువతను బీజేపీ మోసం చేసింది. పలు పరీక్షల పేపర్ లీక్స్, లంచం, అవినీతి కారణంగా నాలుగేండ్లుగా నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. జమ్మూకాశ్మీర్‎లో 2019 నుంచి గవర్నమెంట్ డిపార్ట్​మెంట్ పోస్టుల్లో 65% ఖాళీగా ఉన్నాయి. 

ఆరోగ్యం, ఆతిథ్యం, వ్యవసాయం వంటి రంగాలకు ప్రైవేటు సెక్టార్ పరిమితమైంది. 2021లో న్యూ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చినప్పటికి కేవలం 3 శాతం పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. జమ్మూకాశ్మీర్ యువత మోదీ అండ్ కంపెనీకి అక్టోబర్1న తప్పకుండా ఎగ్జిట్ డోర్ చూపిస్తారు” అని ఖర్గే పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‎లో అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జరగనుండగా అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.