విపక్ష నేతలకు మమతా బెనర్జీ లేఖ

విపక్ష నేతలకు మమతా  బెనర్జీ లేఖ

కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ,సీబీఐ,సెంట్రల్ విజిలెన్స్ కమిషన్,ఇన్ కం ట్యాక్స్ శాఖలను బీజేపీ దుర్వినియోగ పరుస్తోందని ఆరోపించారు. వీటిని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ గా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి విపక్ష నేతలపై వరుస దాడులు చేయించి ప్రతీకారం తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంపై పోరాడేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మేరకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులకు లేఖ రాశారు. అందరూ కలిసి బీజేపీపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.కేంద్రానికి వ్యతిరేకంగా..బలమైన ప్రతిపక్షం ఏర్పడేందుకు వ్యూహాలు చర్చించేందుకు సమావేశమవ్వాలని లేఖలో పేర్కొన్నారామె.

మరిన్ని వార్తల కోసం

 

టీఆర్ఎస్ ఎంపీలు కాలక్షేపం చేస్తుండ్రు

ఇక కరోనా కాలర్ ట్యూన్‌కు గుడ్ బై?