ఏజెంట్తో కలసి వస్తానంటున్న డెవిల్

ఏజెంట్తో కలసి వస్తానంటున్న డెవిల్

హైదరాబాద్: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ఫస్ట్ టైమ్ హిట్ కొట్టిన అక్కినేని వారసుడు అఖిల్ ఈసారి ఫుల్ యాక్షన్ తో రాబోతున్నాడు. డాషింగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ అనే మూవీ చేస్తున్న అఖిల్.. ఇందులో ఎయిట్ ప్యాక్ తో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ కాగా.. తాజాగా మూవీ యూనిట్ మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చింది. భారీ బడ్జెట్ తో హై లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్న రోల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ ఫొటోలో ఆయన గన్ పట్టుకుని ఇంటెన్సివ్ లుక్ లో కనిపించారు. మమ్ముట్టి పాత్ర పేరు డెవిల్ అని, ఆయన రక్షకుడంటూ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పరిచయం చేశారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

కాగా, ‘ఏజెంట్’లో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య న‌టిస్తోంది. స్పై థ్రిల్లర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ కథా రచయిత వ‌క్కంతం వంశీ క‌థ‌ను అందించారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్–సురేంద‌ర్ 2 సినిమా బ్యానర్ లపై రామ‌బ్రహ్మం సుంక‌ర ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ త‌మీజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ర‌గుల్ హెరియ‌న్ ధ‌రుమ‌న్ కెమెరా వ‌ర్క్ చేస్తుండ‌గా.. నేష‌న‌ల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం

పుతిన్కు మోడీ ఫోన్ కాల్

రష్యాలో సేవలు నిలిపేసిన టిక్ టాక్