పత్తి చేనులో గంజాయి సాగు.. 35 మొక్కలు స్వాధీనం

 పత్తి చేనులో గంజాయి సాగు.. 35 మొక్కలు స్వాధీనం

జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ (కే) గ్రామ పరిధిలో పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్​చేశారు. ఎస్సై గంగన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం పోలీసులు గ్రామ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తూ గుమ్నూర్ (కే) గ్రామానికి చెందిన అడా లక్ష్మణ్ అనే రైతు తన పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. 

తనిఖీలు చేసి 35 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకం పూర్తిగా నేరమని, ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.