వీడియో వైరల్: దేవుడా.. కూర్చున్న చెట్టునే నరికేశాడు!

వీడియో వైరల్: దేవుడా.. కూర్చున్న చెట్టునే నరికేశాడు!

న్యూఢిల్లీ: చెట్లను నరకడం చూసే ఉంటారు. తాను కూర్చున్న చెట్టును తానే నరుక్కోవడం లాంటి సామెతలు, కథలను కూడా వినే ఉంటారు. ఇక్కడో వ్యక్తి అలాంటి సాహసమే చేశాడు. తాను కూర్చున్న చెట్టుపై దాదాపుగా కొన వరకు వెళ్లి నరకడం చూస్తే షాకవ్వాల్సిందే. వివరాలు.. ఓ వ్యక్తి ఎత్తయిన తాటి చెట్టుపైకి వెళ్లి దాన్నికట్ చేశాడు. వెంటనే పైభాగం కింద పడిపోయింది. దీంతో చెట్టు ఊగసాగింది. స్ప్రింగులా ఊగుతున్న చెట్టుపై నుంచి సదరు వ్యక్తి పడతాడేమోనని అక్కడి వాళ్లు ఆందోళనకు గురయ్యారు. చెట్టును నరుకుతున్నప్పుడు అతడు దానిపైనే కూర్చోవడం గమనార్హం. అతడు కింద పడ్డాడా లేదా అనేది తెలిసి రాలేదు. కానీ దరిదాపుల్లో ఉన్న వాళ్లు మాత్రం ఓ మై గాడ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం, నవ్వడం, ఆందోళనకు గురవ్వడాన్ని చూడొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 6.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు వావ్, నమ్మలేకుండా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. స్ప్రింగులా ఊగుతున్న ఎత్తయిన చెట్టుపై ఉన్న ఆ వండర్ మ్యాన్ వీడియోను మీరూ లుక్కేయండి.