బొందలపల్లిలో మటన్‌‌ బొక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

బొందలపల్లిలో మటన్‌‌ బొక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
  •     నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా బొందలపల్లిలో ఘటన

నాగర్‌‌కర్నూల్‌‌ టౌన్‌‌, వెలుగు : మటన్‌‌ బొక్క గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా బొందలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి ఓ వ్యక్తి ఇటీవల కొత్త ఇల్లు కట్టుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి మేస్త్రీలకు దావత్‌‌ ఇచ్చాడు. 

ఈ దావత్‌‌కు పక్కనే ఉన్న పోలేముని లక్ష్మయ్య (65) సైతం హాజరయ్యాడు. భోజనం చేసే క్రమంలో మటన్ బొక్క లక్ష్మయ్య గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డాడు. మిగతా వారు గమనించి హాస్పిటల్‌‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.