ఇబ్రహీంపట్నంలో కరెంట్ షాక్తో వ్యక్తి మృతి

ఇబ్రహీంపట్నంలో కరెంట్ షాక్తో వ్యక్తి  మృతి

ఇబ్రహీంపట్నం, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద కరెంట్​షాక్​తో ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌‌‌‌ గ్రామానికి చెందిన ఎం.వెంకటేష్ గౌడ్ (40) శనివారం ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సమీపంలోని కరెంట్ వైర్లు తగలి అక్కడికక్కడే మృతి చెందాడు. కరెంట్ వైర్లు తొలగించాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్​చేశారు.