ప్లేట్‌‌‌‌లో చేతులు కడిగినందుకు యువకుడు హత్య

ప్లేట్‌‌‌‌లో చేతులు కడిగినందుకు యువకుడు హత్య
  • సంగారెడ్డి జిల్లా కొల్లూరు పీఎస్‌‌‌‌ పరిధిలో ఘటన

రామచంద్రాపురం, వెలుగు : ప్లేట్‌‌‌‌లో చేతులు కడిగాడన్న కోపంతో ఓ యువకుడు మరో యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూర్​పీఎస్​పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌లోని గోరాంగ్‌‌‌‌ గ్రామానికి చెందిన శ్యామ్‌‌‌‌ పంచాలు (28) తెల్లాపూర్‌‌‌‌ పరిధిలో కార్పెంటర్‌‌‌‌ పని చేస్తున్నాడు. మూడు రోజులుగా ఉస్మాన్‌‌‌‌నగర్‌‌‌‌లోని హోం ట్రీ అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పనిచేస్తూ అదే రాష్ట్రానికి చెందిన తోటి వర్కర్లు మిథ్లేశ్‌‌‌‌కుమార్‌‌‌‌, అతుల్‌‌‌‌ సుహానితో కలిసి అక్కడే ఉంటున్నాడు.

ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో శ్యామ్‌‌‌‌.. అతుల్‌‌‌‌ సుహానీ ప్లేట్‌‌‌‌లో చేతులు కడిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటా మాట పెరగడంతో ఆగ్రహానికి గురైన అతుల్‌‌‌‌ పక్కనే ఉన్న వస్తువుతో శ్యామ్‌‌‌‌ తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ శ్యామ్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోయాడు.