సెల్ఫీ వీడియో తీసుకుని కృష్ణానదిలో దూకిన వ్యక్తి ..జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి బ్రిడ్జి వద్ద ఘటన

సెల్ఫీ వీడియో తీసుకుని కృష్ణానదిలో దూకిన వ్యక్తి ..జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి బ్రిడ్జి వద్ద ఘటన

ఇటిక్యాల, వెలుగు: కృష్ణానదిలో దూకిన వ్యక్తి గల్లంతైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. ఇటిక్యాల ఎస్ఐ రవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా, మండలంలోని కాశీంనగర్కు చెందిన ఎద్దుల వెంకటేశ్(35) బైక్ పై గురువారం మధ్యాహ్నం ఎర్రవల్లి మండలం బీచుపల్లి సమీపంలోని కృష్ణానది బ్రిడ్జి వద్దకు వచ్చాడు. తాను నదిలో దూకి చనిపోతున్నానని సెల్ఫ్ వీడియో తీసుకుని కుటుంబసభ్యులకు పంపాడు. వెంటనే వనపర్తి పోలీసులకు సమాచారం అందించారు. ఇటిక్యాల ఎస్ఐ రవి, పోలీస్ సిబ్బంది ఎస్టీఆర్ఎఫ్ టీమ్ తో  నదిలో గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు అతని ఆచూకీ లభించలేదు.