రూ.20 గుట్కా తెమ్మనందుకు చంపేశాడు.. బెంగళూరులో వింత హత్యా..

రూ.20 గుట్కా తెమ్మనందుకు చంపేశాడు.. బెంగళూరులో వింత హత్యా..

ఐటి సిటీ బెంగళూరులో ఓ వింత హత్య జరిగింది. రూ.20 గుట్కా తెమ్మని అవమానించాడని ఓ వ్యక్తిని దారుణంగా చంపాడు అతని స్నేహితుడు. బెంగళూరులోని వర్తూర్ ప్రాంతంలో రూ.20 గుట్కా కోసం జరిగిన గొడవలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బబ్లు, నిందితుడు సీతారాం ఇద్దరూ రామగొండనహళ్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్లో  టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు జూలై 28 రాత్రి మద్యం తాగారు. సుమారు 35-36 సంవత్సరాల వయస్సు ఉన్న బబ్లూ, 40 ఏళ్ల సీతారామ్‌కు రూ.20 ఇచ్చి విమల్ గుట్కా తీసుకురమ్మని చెప్పాడు. 

ALSO READ | ఘోర ప్రమాదం: లోయలోకి జారిన ఆర్మీ వాహనం.. ముగ్గురు జవాన్ల మృతి

దింతో గొడవ జరిగింది, తనకంటే చిన్నవాడు అయిన బబ్లూ తనకి గుట్కా తెమ్మని పని చెప్పడంతో సీతారాం అవమానంగా భావించాడు. ఆ రాత్రి తరువాత, బబ్లు నిద్రపోతున్నప్పుడు సీతారాం అతనిపై సుత్తితో దాడి చేశాడు. తరువాత రోజు ఉదయం జూలై 29న ఇతర కార్మికులు నిర్మాణ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. పని విషయంలో నిందితుడు అవమానంగా భావించి, కోపంతో బాధితుడిని సుత్తితో కొట్టాడు. ఈ అహంకార గొడవ కాస్త ప్రాణాంతకంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.  అయితే నిందితుడు సీతారామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

గత నెల మేలో జరిగిన మరో సంఘటనలో సిగరెట్ వివాదం కారణంగా జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సంజయ్ అనే 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరణించగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. సిగరెట్ తీసుకురమ్మంటే తేనందుకు కోపంతో  నిందితుడు ఆ ఇద్దరినీ వెంబడించి వారి బైక్‌ను ఢీకొట్టాడని, రెండు రోజుల తర్వాత సంజయ్ మరణించాడని చెబుతున్నారు.