ట్రైన్ లో నిద్రపోయాడు.. తన్నులు తిన్నాడు..

ట్రైన్ లో నిద్రపోయాడు.. తన్నులు తిన్నాడు..

బస్సుల్లో, రైళ్లల్లో  ప్రయాణించేటప్పుడు  కూర్చొనే నిద్రపోతాం...  ఆ సమయంలో పక్కనున్న వారిపై వాలిపోతారు. అలాంటప్పుడు మీద పడొద్దని చెపుతుంటారు.   అలాగే మెట్రో ట్రైన్ లో ప్రయాణించే వ్యక్తి పక్కన కూర్చున్న ప్రయాణికుడి భుజంపై వాలి నిద్రపోయాడు.  దీంతో వారిద్దరి మధ్య జరిగిన వాగ్వదం కోట్లాటకు దారి తీసిన ఘటన వాషింగ్టన్ లో చోటు చేసుకుంది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో పోస్టు కావడంతో  వైరల్‌ అయ్యింది. 

అమెరికాలోని న్యూయార్క్‌ లో ఘటన జరిగింది. ఒక వ్యక్తి నిద్రపోతూ పక్కన కూర్చొన్న తోటి ప్రయాణికుడి భుజంపై తలమోపాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగి..  నిద్రపోయిన వ్యక్తిని మరో వ్యక్తి మోచేతితో పలుమార్లు కొట్టాడు. ఎదురు సీట్లో కూర్చొన్న బాధిత వ్యక్తి స్నేహితుడు దీనిపై జోక్యం చేసుకున్నాడు. దాడి చేసిన వ్యక్తితో ఫైట్‌ చేశాడు వారిద్దరూ కొంతసేపు కొట్టుకున్నారు. ఇంతలో ఒక స్టేషన్‌లో మెట్రో రైలు ఆగింది. దీంతో బాధిత వ్యక్తి, అతడి స్నేహితుడు అక్కడ దిగి..  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆ మెట్రో రైలులో ప్రయాణం కొనసాగించిన దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.