వెరైటీగా వాటర్ మెలన్ పిజ్జా

వెరైటీగా వాటర్ మెలన్ పిజ్జా

పన్నీర్ పిజ్జా, కార్న్ పిజ్జా, క్యాప్సికం పిజ్జా ఇలా ఎన్నో రకాల పిజ్జాలను చూసుంటాం. కానీ, మీరు వాటర్ మెలన్ పిజ్జా చూశారా? ఆస్ట్రేలియాకు ఒలి పాటర్సన్ అనే వ్యక్తికి వంటలు చేయడం హాబీ. అందులో భాగంగా ఆయన తాజాగా పుచ్చకాయతో పిజ్జా చేయడం ట్రై చేశాడు. దానిని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ చేశాడు. దాంతో అది వైరల్ గా మారడంతో.. డొమినోస్ పిజ్జా కంపెనీ ఈ వాటర్ మెలన్ పిజ్జాను తయారుచేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే ఈ పిజ్జాలో లో కార్బ్ డైట్స్ ఉండటంతో ఆహారప్రియులు ఎక్కువగా ఇష్టపడతారని కంపెనీ భావిస్తోంది. 

ఒలి పాటర్సన్ పుచ్చకాయ పిజ్జాను తయారుచేసే విధానాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. మొదటగా దానిని ముక్కలు చేసి ఆపై గ్రిల్ చేసి, దానిపై బార్‌బెక్యూ సాస్‌ను పోస్తాడు. ఆ తర్వాత దాని మీద పెప్పరోని, జన్ను వేసి.. అది కరిగే వరకు వరకు ఓవెన్‌లో ఉడికించాలి. దీనిని తయారుచేయడం కూడా సింపుల్ గా ఉండటంతో ఆహారప్రియులు కూడా ప్రయత్నిస్తారని ఒలి అంటున్నారు.