కాబోయే భార్య బ్రేకప్ చెప్పిందని.. తనను తానే పెళ్లి చేసుకున్న భర్త

కాబోయే భార్య బ్రేకప్ చెప్పిందని.. తనను తానే పెళ్లి చేసుకున్న భర్త

న్యూఢిల్లీ: ఎంగేజ్‌‌మెంట్ అయిన అమ్మాయి తనతో పెళ్లికి వద్దంటే ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా? నువ్వు వద్దు, నీతో పెళ్లి వద్దు అని ఫియాన్సీ వెళ్లిపోతే ఆ వరుడు ఎంతగా బాధపడి ఉంటాడో కదా?.. కానీ ఇక్కడో అమ్మాయి తనతో పెళ్లి వద్దన్నందుకు వరుడు మిగతావాళ్లలా కుమిలిపోలేదు. ఫియాన్సీ వద్దంటే ఏం? తనను తానే పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటి వింత పెళ్లి అంటారా? అయితే ఈ ఘటన గురించి తెలుసుకుందాం రండి..

డియోగో రాబెలో అనే వ్యక్తి విటోర్ బ్యూనో అనే అమ్మాయితో గత నవంబర్‌‌లో ఎంగేజ్‌‌మెంట్ చేసుకున్నాడు. గత నెలలో వివాహం చేసుకోవాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. అయితే రీసెంట్‌‌గా వారిద్దరికీ ఏదో విషయంపై వాగ్వాదం జరిగి విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో డియోగోకు బ్రేకప్ చెప్పాలని విటోర్ డిసైడ్ అయింది. హఠాత్తుగా విటోర్ పెళ్లికి నో చెప్పడంతో డియోగో షాకయ్యాడు. అయితే పెళ్లికి అమ్మాయి లేకపోతే ఏం.. నిన్ను నువ్వు ప్రేమించుకో గురూ అనే మాదిరిగా, సెల్ఫ్ మ్యారేజ్ సో బెటర్ అంటూ తనను తానే పెళ్లి చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి 40 మంది గెస్ట్‌‌లు హాజరయ్యారు. విటోర్ కుటుంబీకులు, స్నేహితులు మాత్రం ఈ ఫంక్షన్‌‌కు అటెండ్ కాలేదు. ఈ సెల్ఫ్ మ్యారేజ్‌‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.