తొక్కతో తూకం నాకెందుకు : అరటి పండ్ల కొనుగోలులో కొత్త ట్విస్ట్

తొక్కతో తూకం నాకెందుకు :  అరటి పండ్ల కొనుగోలులో కొత్త ట్విస్ట్

కూరగాయల దుకాణానికో.. పండ్ల దుకాణానికో వెళ్తే  కిలోల లెక్కన అమ్ముతున్నారు.  నేరేడుకాయ నుంచి ..పనసపండు వరకు ఏదైనా కిలోల లెక్కే విక్రయం.  ఇప్పటి వరకు డజన్ల లెక్కన అమ్మే అరటిపండ్లు కూడా కిలోల మాదిరిగానే అమ్ముతున్నారు. ఓ సూపర్ మార్కెట్లో మహిళ బనానాలను కొన్న తీరును చూస్తే విస్తు పోవాల్సిందే,,, 

తొక్కతీసి అరటి పండ్లను కిలోల లెక్క కొని డబ్బుని ఆదా చేసిన ఘటన .. టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు కాగా అది కాస్త వైరల్ అయింది. ప్రస్తుతం సూపర్ మార్కెట్లకు జనాలు పరిగెడుతున్నారు.  అక్కడకు వెళితే అన్ని వస్తువులు దొరుకుతాయి.  సహజంగా అలాంటి వాటిల్లో మనకు కావలసిన వస్తువులు ట్రాలీలో వేసుకొని క్యాష్ కౌంటర్ దగ్గరకు వస్తే కాటా వేసి బిల్లు వేస్తారు.  ఓ ప్రేమజంట వూల్ వర్త్స్  సూపర్ మార్కెట్ కు వెళ్లి అరటికాయలు కొనుగోలు చేసింది.  అయితే బోయ్ ఫ్రెండ్ డబ్బును ఆదా చేసేందుకు ఆమె ఎలా అరటిపండ్లను కొనుగోలు చేసిందో ఆమె చేసిన అసాధారణమైన పని చాలా దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎలా కొనుగోలు చేసింది టిక్ టాక్ లో వీడియోను అప్ లోడ్ చేసింది."నా పొదుపుగా ఉండే ప్రియుడు తన అరటిపండ్లపై డబ్బును ఎలా ఆదా చేస్తాడు" అనే శీర్షికతో పోస్ట్ చేసింది.  

డబ్బును పొదుపు చేసే క్రమంలో ఆమె అరటి పండ్ల తొక్కను తీసి సంచిలో వేసుకుంది.  దీనివలన తొక్క బరువు తగ్గి తక్కువ ధరకు ఎక్కువ పండ్లు వప్తాయి.  ఇలా ఆమె  అరటిపండ్లు కొనుగోలు చేసిన విధానాన్ని చూసి చాలా మంది నవ్వుకున్నారు.  ప్లాస్టిక్ సంచిలో తొక్క తీసిన అరటిపండ్లు చెక్ కౌంటర్ దగ్గరకు వెళ్లగానే  ఆమె బోయ్ ఫ్రెండ్ తొక్కలేని అరటిపండ్లను తూకం వేశాడు.  తన ప్రియురాలు డబ్బును ఆదా చేసేందుకు నైపుణ్యాన్ని ప్రదర్శించింనందుకు లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా.. అని ఆమెతో చర్చించాడు.  

దీనిని చూసిన నెటిజన్లు ఆమె తెలివితేటలకు నవ్వుకున్నారు.  అయితే . ఈ పద్ధతి నిజమైన వ్యయ-తగ్గింపు వ్యూహమా లేక కేవలం ఉల్లాసభరితమైన చర్య అని తెలియరాలేదు.  ఏది ఏమైనప్పటికీ, అరటిపండ్లను కొనుగోలు చేయడంలో ఈ  అసాధారణ విధానంపై వినియోగదారులు వారి ఆలోచనలు మరియు అభిప్రాయాలను పంచుకోవడంతో వీడియో త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఈ వీడియోకు అనేక కామెంట్లు వచ్చాయి. డైలీ మెయిల్ కూడా రిలేషన్‌షిప్‌లో ఇది భారీ ఎర్రటి జెండా అని కొంతమంది వ్యాఖ్యానించారు. మరికొంత మంది  ఇది లైఫ్ హ్యాక్ లేదా పొదుపు కాదు. వారు దానిని "పెన్నీ పించర్" అని పోస్ట్ చేశారు.  మరొకరు  నిజమైన పొదుపు వ్యక్తులు బ్యాగ్ లేకుండా బరువు కలిగి ఉంటారని రాసుకొచ్చారు.