అమ్మాయిని వేధించిన వ్యక్తి రిమాండ్

V6 Velugu Posted on Jun 14, 2021

హైదరాబాద్: పార్కు వద్ద అమ్మాయిని మానసికంగా వేధించిన వ్యక్తి విషయంలో పోలీసులు వెంటనే స్పందించి అరెస్టు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో కొంపల్లి సెంట్రల్ పార్కు వద్ద అమ్మాయిని వేధిస్తున్న వ్యక్తి ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఒక వ్యక్తి మానసికంగా వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు చిట్టూరి రామదుర్గారావు (32) అదుపులోకి తీసుకున్నారు.

విచారణ చేయగా ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న నిందితుడు  కొంపల్లి సెంట్రల్ పార్కు వద్ద ఎక్సలెంట్ బ్యాయ్స్ హాస్టల్ లో ఉంటున్నట్లు గుర్తించారు. నిందితుడు సెంట్రల్ పార్కు సమీపంలో ఉన్న ఓ యువతిని మానసికంగా వేధించాడని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రామదుర్గారావును రిమాండుకు తరలించారు పేట్ బషీరాబాద్ పోలీసులు.

Tagged Hyderabad Today, , harassing girl at park, Chittoori Ramadurgarao (32), Kompally Central Park, Pate Bashirabad Police Station limits, eave teasing case

Latest Videos

Subscribe Now

More News