తాగిన మత్తులో బావమరిదిని పొడిచి చంపిన బావ

తాగిన మత్తులో బావమరిదిని పొడిచి చంపిన బావ

మద్యం మత్తులో ఓ బావ తన సొంత బావమారిదిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా సూరారంలో జరిగింది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన ఆంజనేయులును సూరారం దయనంద్ నగర్లో ఉండే బావ మైసయ్య గత రాత్రి మద్యం తాగుదామని పిలిచాడు. మద్యం తాగిన అనంతరం ఏదో విషయంలో మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. దాంతో కోపోద్రిక్తుడైన బావ మైసయ్య.. బావమరిది ఆంజనేయులును గొంతులో కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.