బీహార్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడకూడదని అన్నందుకు ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా( పబ్జీ) ఆడవద్దని కుటుంబ సభ్యులు అతన్ని మందలించారు. మోతిహారిలో ఓ యువకుడు ఆన్ లైన్ గేమ్స్ కు అడిక్ట్ అయ్యాడు. రోజులో ఎక్కువ సేపు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా( పబ్జీ) గేమ్ ఆడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఆ గేమ్ ఆడొద్దని యువకుడితో వాదించారు.
ఫ్యామిలీతో వాగ్వాదం చేసి ఆవేశంలో ఆ యువకుడు రెండు నెయిల్ కటర్లు, తాళ చెవిలు, కత్తి మింగేశాడు. అవి మింగేశాక కొంత సమయం వరకు అతనికి ఏం కాలేదు. తర్వాత అతని పరిస్థితి విషమించింది. మోతిహారిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు అతన్ని తరలించారు. ఎక్స్ రే తీసి.. డాక్టర్లు గంటన్నర పాటు ఆపరేషన్ చేసి రెండు నెయిల్ కటర్లు, తాళాలు, కత్తిని బయటకు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ చెప్పాడు.