వీడియో: నడిరోడ్డుపై యాంకర్‌ను చూసి ఆగలేక.. ఏం చేశాడో చూడండి

వీడియో: నడిరోడ్డుపై యాంకర్‌ను చూసి ఆగలేక.. ఏం చేశాడో చూడండి

కామాతురాణాం న భయం.. న లజ్జ.. అన్నారు.. పెద్దలు. అంటే కామంతో రగిలిపోయేవారికి.. భయం, లజ్జ వంటివేమీ ఉండవన్నమాట. ముందు ఆ యావ తీరితే కానీ.. వాళ్లు మామూలు మనుషులు కాలేరన్నమాట. ఈ వ్యాఖ్యం మరిచిపోకుండా ఎప్పటికప్పుడు కొందరు కామాంధులు జీవం పోస్తూనే ఉన్నారు. ఇదిగో అలాంటి వారిలో ఇతనొక్కడు. నడిరోడ్డుపై అందమైన యాంకర్‌ను చూసి ఆగలేక.. వెనకనుండి ఒక్కటిచ్చాడు. అది అతని కామకోరికను కాసేపు శాంతింప చేసినా.. ఆ తరువాత మాత్రం అతని జీవితం తలకిందలైంది. 

స్పెయిన్, మాడ్రిడ్ వీధుల్లో ఒక స్పానిష్ మహిళా జర్నలిస్ట్ అక్కడ జరిగిన ఒక దోపిడీ గురుంచి లైవ్ లో వివరిస్తూ ఉండగా.. వెనుకనుండి వచ్చిన ఒక వ్యక్తి ఆమె పట్ల  అసభ్యంగా ప్రవర్తిస్తాడు. బహిరంగంగా ఒక మహిళ వెనుక భాగాన్ని తాకడమే కాకుండా.. ఆమె ఏ ఛానెల్ లో పనిచేస్తుందో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఆమె పనిచేస్తున్న స్టూడియో సిబ్బంది.. ఆమెకు మరింత అసభ్యకర ప్రశ్నలు సంధించాడు.  "ఇసా, నీకు అంతరాయం కలిగించినందుకు నన్ను క్షమించు... కానీ అతను నిన్ను అక్కడ తాకాడా? అని అడిగాడు. సదరు ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేక మిన్నకుండి పోయింది. 

అనంతరం సదరు మహిళా జర్నలిస్ట్.. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి అదే ప్రశ్న అడగ్గా.. అతను ఆ ఆరోపణలను ఖండించాడు. ఆమె అడుగు భాగాన్ని తాకలేదని చెప్పి అక్కడినుండి వెళ్లిపోతాడు. అనంతరం సదరు మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే తాకాడని విచారణలో తేలితే.. 6 నెలల నుండి ఏడాదిపాటు జైలు శిక్ష పడుతుందని అధికారులు తెలిపారు.