నస్పూర్, వెలుగు : మహిళల భద్రతే షీ టీం లక్ష్యమని మంచిర్యాల జోన్ షీటీమ్ ఎస్ఐ హైమ, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్ కుమార్ అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో పని చేస్తున్న సింగరేణి మహిళా ఉద్యోగులకు శుక్రవారం జీఎం ఆఫీస్‌లో షీ టీంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడైనా ఆకతాయిలు మహిళలను భయాందోళనలకు గురిచేసినా, వేధించినా తమకు ఫిర్యాదు చేయాలన్నారు.
డయల్ 100 లేదా షీ టీం 6303923700 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్1930 కు ఫిర్యాదు చేయాలన్నారు. జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను ఎవరైనా వేధిస్తే సింగరేణి సంస్థలోని ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి తెలియజేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బాజీ సైదా, అధికారుల సంఘం ట్రెజరర్ పద్మ, డీజీఎం పర్సనల్ ఎస్.అనిల్ కుమార్, ఎస్టేట్స్ అధికారి వరలక్ష్మి, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి,షీ టీమ్ సిబ్బంది, సింగరేణి మహిళా ఉద్యోగులు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంతి గదులు ప్రారంభం..
శ్రీరాంపూర్ ఏరియాలో సెక్యూరిటీ విభాగంలో రూ.15 లక్షలతో నిర్మించిన ఆఫీస్ కార్యాలయం, సెక్యూరిటీ అధికారి కార్యాలయం, మేల్ సెక్యూరిటీ గార్డుల విశ్రాంతి గది, ఫిమేల్ సెక్యూరిటీ గార్డుల విశ్రాంతి గదులను శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ప్రారంభించారు.
