RAAKA సెట్స్‌లో మంచు లక్ష్మి: ‘వింత జీవులు.. భారీ సెట్స్.. బన్నీ స్వాగ్’ మైండ్ బ్లాక్ అంటూ వీడియో

RAAKA సెట్స్‌లో మంచు లక్ష్మి:  ‘వింత జీవులు.. భారీ సెట్స్.. బన్నీ స్వాగ్’ మైండ్ బ్లాక్ అంటూ వీడియో

అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు ‘రాకా’ (RAAKA). సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపిక పదుకొణె హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచాయి.

ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన వార్తలు ఒక్కోటిగా క్రేజీ టాక్తో బయటకొస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ నటి మంచి లక్ష్మి ‘రాకా’ సెట్స్‌ని సందర్శించింది. ఈ సందర్భంగా మంచి లక్ష్మి ఓ వీడియో ద్వారా  ‘రాకా’ విశేషాలను పంచుకుని.. సినీ అభిమానుల్లో భారీ హైప్ తీసుకొచ్చింది. 

RAAKA సెట్స్‌లో మంచు లక్ష్మి సందడి..

తాజాగా టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ‘రాకా’ షూటింగ్ సెట్‌ను సందర్శించారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఆమె సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సెట్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచే తాను ఆశ్చర్యపోయానని, ఇంత భారీ స్థాయిలో రూపొందించిన ప్రపంచాన్ని ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని ప్రశంసించారు.

“ఇప్పుడే రాకా సినిమా సెట్‌ను సందర్శించాను. ఆశ్చర్యంతో నా నోరు వెళ్ళబెట్టాలని అనిపించింది. అక్కడ నేను ఎప్పుడూ చూడని ఎన్నో రకాల జీవులు, ప్రాణులు ఉన్నాయి. ప్రతి మూలలో ఒక కొత్త ప్రపంచం కనిపించింది” అని మంచు లక్ష్మి అన్నారు.

అల్లు అర్జున్ మాస్ స్వాగ్‌కు ఫిదా

అల్లు అర్జున్ లుక్, ఆయన మాస్ స్వాగ్, సెట్‌లో ఉన్న ఎనర్జీ తనను బాగా ఆకట్టుకున్నాయని మంచు లక్ష్మి చెప్పారు. అలాగే ఆర్ట్ డిపార్ట్‌మెంట్, విజువల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, వివిధ సాంకేతిక విభాగాలు పనిచేస్తున్న తీరు చూసి ఇది సాధారణ సినిమా కాదని అర్థమైందన్నారు.

“ఇలాంటి సెట్‌లను నేను ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా ఒక విజువల్ వండర్. ఈ సినిమా కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అంటూ మంచు లక్ష్మి సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చింది. 

చెప్పాలని ఉంది.. కానీ చెప్పలేను!

సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నప్పటికీ, చిత్ర బృందం గోప్యత కారణంగా ఏ వివరాలు బయటపెట్టలేనని మంచు లక్ష్మి సస్పెన్స్ క్రియేట్ చేశారు. “ఎన్నో విషయాలు పంచుకోవాలని ఉంది… కానీ చెప్పలేను!” అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నా 18 ఏళ్ల కల: అట్లీ ఎమోషనల్ నోట్.. 

ఈ ప్రాజెక్ట్ గురించి ఇటీవల దర్శకుడు అట్లీ ఎక్స్‌ (X) వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 'రాకా' అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది నా 18 ఏళ్ల కల. ఈ ఐడియాను ఇన్నేళ్లుగా నాలోనే దాచుకున్నాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు. మరోవైపు, ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఒక కీలక అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. షారుఖ్ స్వయంగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తుండటం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తోంది. మరి రాకా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.