మా నాన్నకు ఆహ్వానం ఉంది... కానీ అందజేయలేదు

మా నాన్నకు ఆహ్వానం ఉంది... కానీ అందజేయలేదు

సీఎం జగన్‌తో భేటీపై మాట్లాడారు మా అధ్యక్షుడు, ప్రముఖ హీరో మంచు విష్ణు. జగన్ ను కలవడం ఇది మూడో సారి అని తెలిపారు. జగన్‌ తనకు వరుసకు బావ అవుతారన్నారు. అయినా కూడా ఆయనను అన్న అని పిలుస్తానన్నారు. ఇవాళ కలిసింది పూర్తిగా పర్సనల్ విజిట్ అన్నారు. తిరుపతిలో స్టూడియోలు కడతానన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు తమకు కావాలన్నారు మంచు విష్ణు. తెలంగాణ,ఆంధ్రా రెండు కళ్లు అన్నారు. విశాఖలో అవకాశాల కోసం ఫిల్మ్ ఛాంబర్లో చర్చిస్తామన్నారు. మొన్న జరిగిన చర్చల్లో మిస్ కమ్యూనికేషన్ జరిగిందన్నారు. తన తండ్రి మంచు మోహన్ బాబుకు ఇన్విటేషన్ వచ్చిందని...అయినా ఆయనకు అందజేయలేదన్నారు. 

పేర్ని నాని తో సమావేశం పై ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేసిందన్నారు. తనకు అన్ని పార్టీల్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్నారన్నారు మంచు విష్ణు. టీడీపీలో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్నారన్నారు. పేర్ని నాని మా ఇంటికి వస్తే ఏదో కారణాలు చెప్తూ ప్రచారం చేశారన్నారు. తమకు సపోర్ట్ లేకపోతే మా ప్రెసిడెంట్ గా ఎలా గెలుస్తాననని మంచు విష్ణు పేర్కొన్నారు. అందరినీ చిత్తు చిత్తుగా ఓడించానన్నారు. ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ తన తండ్రి అన్నారు. ఎవరు ఇలా చేశారో మాకు తెలుసన్నారు మంచు విష్ణు. ఎలా కరెక్ట్ చేయాలో మేము ఆలోచిస్తామన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక కుటుంబం అన్నారు.చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చని వాటని పరిష్కరించుకుంటామని మంచు విష్ణు తెలిపారు. 

ఇవి కూడా చదవండి:

ఏపీ,తెలంగాణలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చెస్తం

జగన్‌తో సమావేశానికి నేను రానన్నా