సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలి : భూ శంకరయ్య

సైబర్ మోసాలపై  అవగాహన పెంచుకోవాలి : భూ శంకరయ్య


కోల్ బెల్ట్, వెలుగు: సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మందమర్రి ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూ శంకరయ్య తెలిపారు.  గురువారం మందమర్రి జీవీటీసీ సమావేశ మందిరంలో సైబర్ నేరాలపై ఉద్యోగులకు కల్పించే అవగాహన కార్యక్రమాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆదేశాల మేరకు నేషనల్ సైబర్ సెక్యూరిటీ అవగాహన నెలగా అక్టోబర్ నెలను ప్రకటించారని, దానికి అనుగుణంగా అధికారులు గనులపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు.  ఇటీవల సైబర్ మోసాలు పెరుగుతున్నాయన్నారు. 

కార్యక్రమంలో ఈ మెయిల్ సేఫ్టీ, మొబైల్ సేఫ్టీ, డిజిటల్ అరెస్ట్, మొదలగు విషయాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం సైబర్ నేరాలపై నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్పొరేట్ డీవైజీఎం (ఐటీ) శ్రీనివాస రావు, డీఎస్‌‌‌‌ నానా పర్నవేస్, మందమర్రి జీవీటీసీ మేనేజర్ శంకర్, మందమర్రి డి.వై మేనేజర్ (ఐ.టి) రవి, జీవీటీసీ ట్రైనింగ్ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.