కుకీలకు ప్రత్యేక పాలన వద్దంటూ ర్యాలీ

కుకీలకు ప్రత్యేక పాలన వద్దంటూ ర్యాలీ

ఇంఫాల్:  మణిపూర్ కొండ ప్రాంతాల్లోని చిన్–కుకీ–జోమీ గిరిజనులు చేస్తున్న సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ డిమాండ్​కు వ్యతిరేకంగా శనివారం ఇంఫాల్ లోయలోని 5 జిల్లాల మైతీ తెగ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటెగ్రిటీ(కొకోమి) ఆధ్వర్యంలో ఇంఫాల్ వెస్ట్ జిల్లా తంగ్మెబంద్ నుంచి ఇంఫాల్ ఈస్ట్ జిల్లా హప్తా కంగ్జిబునంద్ వరకు 5 కి.మీ. దూరం నిరసన ర్యాలీ చేపట్టారు. మయన్మార్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను పంపేయాలని, ఎన్ఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

కాగా, మణిపూర్ జనాభాలో ఇంఫాల్ లోయ ప్రాంతంలో నివసించే మైతీ తెగ ప్రజలు 53%, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ, నాగా తెగల ప్రజలు 40% ఉన్నారు. రాష్ట్రంలోని 90% భూములు కుకీ, నాగా ప్రజల చేతుల్లోనే ఉన్నాయి. మైతీలకు ఎస్టీ హోదాను వ్యతిరేకిస్తూ వీరు మే 3న నిరసన ర్యాలీ చేపట్టడంతో అల్లర్లు చెలరేగాయి.