
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మనోజ్ సిన్హా ఈ రోజు(శుక్రవారం,ఆగస్టు-7) స్వీకారం చేశారు. జమ్ముకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ నూతన ఎల్జీతో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిన్హా మూడుసార్లు లోక్‌సభకు ఎంపీగా గెలుపొందారు. 2016లో ప్రధాని మోడీ కేబినెట్‌లో కేంద్ర సమాచారా ప్రసారశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. మాజీ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్మును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించడంతో.. కశ్మీర్ గవర్నర్‌గా మనోజ్ శుక్రవారం ప్రమాణం చేశారు. కశ్మీర్‌కు ఎల్జీగా నియమితులైన మొదటి రాజకీయ నేతగా మనోజ్ నిలిచారు.