దక్షిణాదిలో కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రి సమీక్ష

దక్షిణాదిలో కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రి సమీక్ష

ఢిల్లీ: తెలంగాణ, ఏపీ సహా 8 రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్ష నిర్వహించారు. టీకా పంపిణీలో పురోగతి, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంపై కేంద్రమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, కొవిడ్ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ అనే ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. పరస్పర సహకారం, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయంతోనే దేశంలో వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోందని మన్సుఖ్ మాండవీయా అభిప్రాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు బీహార్, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారుతో ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను మంత్రి సమీక్షించనున్నారు.

For more news..

బీజేపీ ఎంపీ అర్వింద్ కు లోక్ సభ స్పీకర్ ఫోన్

ఢిల్లీలో తగ్గుతున్న కరోనా కేసులు