కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని మునిగింది : వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని మునిగింది : వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజకవర్గం నష్టపోయిందని బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ఫ్యామిలీ కోట్లు దోచుకుందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలం అన్నారంలో బీజేపీ ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి.. భూములు మునిగినా కేసీఆర్, రైతులను ఆదుకోలేదన్నారు. కాళేశ్వరం కాంట్రాక్టర్ ను కోటీశ్వరున్ని చేసిండని విమర్శించారు. కాళేశ్వరంతో మంథనికి ఒరిగిందేమీ లేదన్న ఆయన.. నియోజకవర్గ ప్రజలను నిండా ముంచారని చెప్పారు. మంథనిలో 40 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు.

రూ.30 లక్షల ప్రజల సొమ్మును నెలకు జీతం పేరుతో కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని  వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రధాని మోడీకి ప్రజలపై అభిమానం ఉందని, అందుకే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వేలాది ఇండ్లు పేదలకు నిర్మిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని గద్దె దించాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. మన రాష్ట్ర సొమ్మును ఇతర రాష్ట్రాలకు కేసీఆర్ పంచుతున్నాడని ఆరోపించారు. రూ.100  కోట్లు తెలంగాణ ప్రజల డబ్బుతో నాందేడ్లో బీఆర్ఎస్ మీటింగ్ పెడుతున్నాడని చెప్పారు. బీజేపీని మరింత బలోపేతం చేయాలని, తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని కోరారు.