అమర్నాథ్ లో వర్ష బీభత్సం..వరదలో చిక్కుకున్న భక్తులు

అమర్నాథ్ లో వర్ష బీభత్సం..వరదలో చిక్కుకున్న భక్తులు

జమ్మూకాశ్మీర్ అమర్నాథ్ ఆలయం వద్ద కుంభవృష్టి కురుస్తోంది. కొండలపైనుంచి వస్తున్న వరదలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. దాదాపు 12 వేల మంది యాత్రికులు గుడారాల్లో తలదాచుకున్నారు. భారీగా వచ్చిన వరదకు గుడారాలు, యాత్రికులు కొట్టుకపోయారు. ఈ ఘటనలో 10మంది మృతి చెందగా..పలువురు గల్లంతయ్యారు. గుడారాల్లోకి వరద ఒక్కసారిగా రావడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యాత్రికులను రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండచరియలు సైతం విరిగిపడుతుండటంతో అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు అధికారులు.