ధరలు పెరిగినయ్.. ఇంటి బడ్జెటూ ​పెరిగింది

ధరలు పెరిగినయ్.. ఇంటి బడ్జెటూ ​పెరిగింది

న్యూఢిల్లీ: ఇన్​ఫ్లేషన్​ (ధరల పెరుగుదల) కారణంగా  చాలా మంది ఇంటి బడ్జెట్​ పెరిగినట్టు తాజా సర్వేలో తేలింది. ఫ్యూయల్​,  నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలే ఈ పరిస్థితికి కారణమని సర్వేలో పాల్గొన్నవారిలో 92 % కుటుంబాలు వెల్లడించాయి. గడచిన మూడు నెలల్లో తమ సగటు నెలవారీ ఖర్చులు పెరిగాయని చెప్పారు.  ఇంటి ఖర్చులు 10 % వరకు పెరిగాయని మెజారిటీ రెస్పాండెంట్లు అన్నారు. కమ్యూనిటీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. వచ్చే మూడు నెలల్లో నెలవారీ ఖర్చులు 10 % కంటే ఎక్కువ పెరుగుతాయని అనుకుంటున్నామని 55 %  మంది రెస్పాండెంట్లు చెప్పారు. 10 % పెరుగతాయని 26 % మంది అన్నారు.  ఈ సర్వే కోసం లోకల్ సర్కిల్‌‌‌‌  12,000 కంటే ఎక్కువ ఇండ్ల నుంచి 23,500 మంది నుంచి అభిప్రాయాలను తీసుకుంది. 42% మంది రెస్పాండెంట్లు టైర్ 1 నగరాలకు చెందినవారు కాగా, 31% మంది టైర్ 2 నగరాల నుండి,  మరో 27% మంది రెస్పాండెంట్లు టైర్ 3, 4  గ్రామీణ జిల్లాల నుంచి ఉన్నారు. ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా యుద్ధం కారణంగా గడిచిన 3 నెలల్లో పెట్రోలు, డీజిల్, వంటనూనెలు, నిత్యావసర వస్తువులు, సేవల ధరలు పెరగడంతో ఇంటి బడ్జెట్​పై భారం పడిందని లోకల్​ సర్కిల్స్​ తెలిపింది. చాలా వస్తువుల ధరలు అనేక సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. 

భారీగా టోకు ధరలు...

ఈ వారం ప్రారంభంలో కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం, టోకు ధరల ఇన్​ఫ్లేషన్​ తొమ్మిదేళ్లలో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది​ఈ ఏడాది మార్చిలో 14.5% నుండి ఏప్రిల్‌‌‌‌లో 15.08శాతంకి పెరిగింది. ఆహారం  వస్తువుల ధరల పెరుగుదల వల్లే ఇన్​ఫ్లేషన్​ ఇంత భారీగా ఉందని ప్రభుత్వం తెలిపింది. టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) ఇన్​ఫ్లేషన్​గడచిన 13 నెలలుగా రెండంకెల మేర రికార్డు అవుతోంది. పెట్రోల్,  డీజిల్ ధరలను లీటర్‌‌పై రూ.10 తగ్గిస్తే ఇంటి ఖర్చులు చాలా వరకు దిగొస్తాయని లోకల్‌ సర్కిల్ అభిప్రాయపడింది.