మన్యంలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు

మన్యంలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు

భద్రాచలం, వెలుగు : తెలంగాణ, ఏపీ సరిహద్దులోని మన్యంలో సోమవారం మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కనిపించాయి. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు వేళ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, -అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాల మావోయిస్టు పార్టీ కమిటీ పేరుతో చర్ల మండలం ఆర్​.కొత్తగూడెంలో మావోయిస్టులు బ్యానర్లు కట్టి, కరపత్రాలను పడేశారు.  గ్రామగ్రామాన వారోత్సవాలు, సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అమరులైన మావోయిస్టుల లీడర్లను స్మరించుకోవాలని సూచించారు.

 ఆపరేషన్​కగార్​ను ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దామంటూ లేఖలో పేర్కొన్నారు. ఆపరేషన్​సమాధాన్​, సూరజ్​కుండ్ వ్యూహాలు విఫలం కావడంతో కగార్​పేరిట క్రూరమైన దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. కదలికలను తెలుసుకునేందుకు పోలీసులు జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత పోలీస్​స్టేషన్ల పరిధిలో ఆంక్షలు విధించారు. బస్టాండ్లు, రహదారుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.  హిట్ లిస్టులో ఉన్న వారిపై నిఘా పెట్టారు. మావోయిస్టులు, పోలీసుల చర్యలతో ఏజెన్సీలో తీవ్ర భయాందోళన నెలకొంది.