
- మరో ప్రాంతంలో మావోయిస్టు జంట అరెస్ట్నాలుగు తుపాకులు,
- మందు పాతర్ల తయారీ సామగ్రి స్వాధీనం
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మరో ప్రాంతంలో మావోయిస్టు జంటను అరెస్ట్ చేశారు. బీజాపూర్జిల్లాలోని ఇంద్రావతి నేషనల్పార్కు ఏరియాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమయ్యారనే ముందస్తు సమాచారంతో ఎస్పీ జితేంద్రకుమార్యాదవ్ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. శనివారం ఉదయం బలగాలకు, మావోయిస్టులకు పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి.
దీంతో కొందరు మావోయిస్టులు పారిపోగా, ఒకరి డెడ్ బాడీతోపాటు తుపాకీని స్వాధీనం చేసుకోగా.. ఆపరేషన్ కొనసాగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్పి తెలిపారు. అదేవిధంగా కాంకేర్జిల్లాలో అబూజ్మాడ్ ఏరియాలోని మీండే గ్రామ అడవుల్లో బీఎస్ఎఫ్బలగాలు కూంబింగ్నిర్వహిస్తుండగా మావోయిస్టు జంట అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులను చూసి పారిపోతుండగా వెంటాడి పట్టుకుని, వారి వద్ద నాలుగు బర్మార్తుపాకులతో పాటు, మందుపాతర్ల తయారు చేసేందుకు వినియోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు జంటను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. బీఎస్ఎఫ్ బలగాలు పూర్తి వివరాలు వెల్లడించలేదు..